నయన్ కు ఊహించని షాక్.. ఆమె స్థానంలోకి సమంత

ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్యే కాదు.. హీరోయిన్ల మ‌ధ్య కూడా భారీ పోటీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరోల‌కు రెండు మూడు ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ హీరోయిన్ల‌కు అలా కాదు. అక్క‌డ రెండు ఫ్లాపులు వ‌చ్చాయంటే ప‌రిస్థితులు మారిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. న‌య‌న‌తార‌కు కొన్నేళ్ల నుంచి స‌రైన విజ‌యం రాలేదు. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తుంది కానీ విజ‌యం మాత్రం ప‌ల‌క‌రించడం లేదు. దానికి తోడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా క‌లిసిరావ‌డం లేదు.ఒక‌ప్పుడు న‌య‌న్ క‌థ ఓకే చేసిందంటే హిట్ అనే న‌మ్మ‌కంతో ఉండేవాళ్లు అభిమానులు.

కానీ ఇప్పుడు అలా కాదు.. ఆమె న‌టించిన సినిమాలు వ‌ర‌సగా ఫ్లాప్ అవుతూ వ‌స్తున్నాయి. దాంతో ఇప్పుడు న‌య‌న‌తార న‌టించిన సినిమా సీక్వెల్ ఆమె చేజారిపోయేలా క‌నిపిస్తుంది. రెండేళ్ల కింద న‌య‌న్ న‌టించిన అర‌మ్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో కూడా క‌ర్త‌వ్యం పేరుతో వ‌చ్చి కంట‌త‌డి పెట్టించింది ఈ చిత్రం. బోరుబావిలో ప‌డ్డ చిన్నారిని కాపాడ‌టానికి ఓ క‌లెక్ట‌ర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడి ఎలా గెలిచింది అనేది ఈ చిత్ర క‌థ‌.ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించింది. తెలుగులో కూడా ప‌ర్లేద‌నిపించింది. ఇలాంటి స‌మ‌యంలో ఈ సినిమాకు సీక్వెల్ చేయాల‌నుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు గోపీ నైన‌ర్.

ఈ సీక్వెల్లో కూడా ముందు న‌య‌న‌తార‌నే తీసుకోవాల‌నుకున్నా కూడా ఇప్పుడు స‌మంత‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి ఈ చిత్ర సీక్వెల్లో స‌మంత ఎలా న‌టించ‌బోతుందో చూడాలిక‌.