అమ్మో దెయ్యం.. భయపెడుతున్న రాజుగారి గది 3 ట్రైలర్..

యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్..రాజు గారి గది చిత్రంతో డైరెక్టర్ గా సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. హర్రర్ కు కామెడీ మిక్స్ చేసి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దీనికి సీక్వెల్ తీసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా దీనికి మూడో పార్ట్ గా రాజు గారి గది 3 తెరకెక్కిస్తున్నారు.మొదట రెండు చిత్రాలలో పూర్ణ, సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటిస్తుంది. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేసి సినిమాపై ఆసక్తి నింపారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఒకటిన్నర నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ హారర్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది.

మొదటి రెండు భాగాలలో హారర్ కి హాస్యం జోడించి తీసిన ఓంకార్ మూడవ భాగంలో కేవలం హారర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మొదటి రెండు భాగాలలో చేసిన అశ్విన్ బాబు మరో మారు రాజుగారి గది 3 లో హీరోగా చేస్తుండగా, బ్రహ్మజీ, ఊర్వశి, ధన్రాజ్, అజయ్ ఘోష్, అలీ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.