బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్… రెండు పెళ్ళిళ్ళ వెనుక ఇంత కథ వుందా..

హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలంటే ఖాన్ త్రయమే అని చెప్తూంటారు. వారిలో డిఫరెంట్ పర్సన్ అంటే అమీర్ ఖాన్ పేరు చెప్తారు. అందుకే ఆయన్ను మిస్టర్ ఫర్ఫెక్ట్ అంటూ ఉంటారు. అమీర్ కు కథ నచ్చి సినిమా చేస్తే అందులో ఎంత వైవిధ్యం ఉందో అనే క్యూరియాసిటీ దేశం మొత్తం భావించే స్థితికి చేరుకున్నాడు. ఎన్నో హిట్లు, అంతకు మించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అమీర్ అందరిలోకి పర్ఫెక్ట్ చేసింది. అయితే.. పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని రెండో పెళ్లి చేసుకున్నాడు.

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా. ఈమెను 1986లో పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి చిత్రం ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా చేసింది రీనా. వీరికి కూతురు ఇరా, కొడుకు జునైద్ ఉన్నారు. వీరి వివాహబంధంలో వచ్చిన ఒడిదుడుకుల వల్ల 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావ్ ను అమీర్ రెండో వివాహం చేసుకున్నాడు. లగాన్ సినిమాకు కిరణ్ రావ్ అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. వీరికి 2011లో కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ జన్మించాడు.

వృత్తి రీత్యా ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా అమీర్. అయినా కూడా రెండో పెళ్లి చేసుకున్నాడనే మట తప్పలేదు. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్నా.. ఇప్పటికీ తామిద్దరం ఫ్రెండ్స్ లా ఉంటామని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. అమీర్ కూతురు ఇరా ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేస్తోంది. ప్రస్తుతం అమీర్ లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్నాడు. హీరోయిన్ గా కరీనా కపూర్ నటిస్తోంది.