ఆమె కోసం అన్ని ఖర్చులు బరించిన రాం చరణ్.. ఎందుకిలా అంటున్న సినీ పెద్దలు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటుడిగా, నిర్మాతగా ద్విపాత్రభినయం చేస్తున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేస్తున్నాడు. గతంలో చిరు కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ని నిర్మించిన చెర్రీ.. తాజాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా: నరసింహారెడ్డి’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘సైరా: నరసింహారెడ్డి’లో చిరంజీవి సరసన దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది.

తెలుగు, తమిళ సినిమాలతో ఆమె బిజీగా ఉండడంతో డేట్స్‌ను సర్ధుబాటు చేసుకునేందుకు నయనతార భారీ మొత్తం డిమాండ్ చేసిందని, ఆమె కోసం రామ్ చరణ్ భారీ రెమ్యూనరేషన్ చెల్లించారని గతంలోనే వార్తలు వచ్చాయి. మొదట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెమ్యూనరేషన్ చెల్లించినప్పటికీ.. నయనతార సొంత ఖర్చులు కూడా రామ్ చరణే భరించాడని ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. షూటింగ్ ఉన్న రోజుల్లో ఆమె బస చేసేందుకు స్టార్ హోటల్స్ బుక్ చేయడం సహా ఎన్నో ఖర్చులను నిర్మాత అయిన చెర్రీనే భరించాడని తమిళ ఇండస్ట్రీ కోడై కూస్తుందట. అంతేకాదు, ఈ లెక్కలన్నీ చూసి సినీ పెద్దలు నోరెళ్లబెడుతున్నారని కూడా అక్కడ అనుకుంటున్నారని వినికిడి.రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన తండ్రి కమ్‌బ్యాక్ మూవీని నిర్మించినట్లే దీన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అయితే, ఈ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం బౌండరీస్ పెట్టలేదట. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఖర్చు చేశాడని తెలుస్తోంది. దాదాపు రూ. 150 కోట్లతో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో పాటు తన తండ్రి సినిమా టాప్‌లో ఉండాలనే ఖర్చుకు వెనకాడలేదని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.