రెండో పెళ్ళి చేసుకున్న అమలాపాల్ మాజీ భర్త.. అమ్మాయి ఏవరో తెలిస్తే షాకే..!

హీరోయిన్ అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నిన్న రాత్రి చెన్నైలో ఇతడి వివాహం జరిగింది. కేవలం కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గుంభనంగా పెళ్లి చేసుకున్నాడు ఏఎల్ విజయ్. చెన్నైకు చెందిన డాక్టర్ ఐశ్వర్యను విజయ్ పెళ్లాడాడు. ఈ పెళ్లికి సినీప్రముఖులు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి తర్వాత ఓ ఫొటోను మాత్రం సోషల్ మీడియాలో విడుదల చేశారు.

గతంలో అమలాపాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏఎల్ విజయ్. కానీ వాళ్ల కాపురం సజావుగా సాగలేదు. కుటుంబంలో తలెత్తిన వివాదాల కారణంగా మూడేళ్లు కూడా నిండకుండానే వాళ్లు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకున్న ఇన్నేళ్లకు ఏఎల్ విజయ్, ఐశ్వర్యను పెళ్లాడాడు. ఈసారి మాత్రం ఇది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి. తన పెళ్లి విషయాన్ని కొన్నిరోజుల కిందట విజయ్ స్వయంగా ప్రకటించాడు. ఐశ్వర్యను పెళ్లాడబోతున్నట్టు తెలిపాడు. తన వివాహాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యవహారంలా జరపబోతున్నామని, ఎవరూ ప్రత్యేక ఆహ్వానితులు ఉండరని అప్పుడే స్పష్టంచేశాడు. చెప్పినట్టుగానే నిరాడంబరంగా విజయ్-ఐశ్వర్యల వివాహం జరిగింది.

విజయ్ పెళ్లి జరుగుతున్న సమయానికి ఆమె మాజీ భార్య అమలాపాల్ హైదరాబాద్ లో ఉంది. ప్రస్తుతం ఆమె ఆడై అనే తమిళ సినిమా చేస్తోంది. తెలుగులో “ఆమె” పేరుతో ఆ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్ కోసం అమలాపాల్ హైదరాబాద్ వచ్చింది. ఇక విజయ్ విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం జయలిలత బయోపిక్ పై వర్క్ చేస్తున్నాడు.