అల్లు అర్జున్ తో గొడవ.. ఆగిపోయిన కొత్త సినిమా.. రంగంలోకి త్రివిక్రం

గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీకి అనుకోని బ్రేక్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా బన్నీ తాను నటించే సినిమాల షూటింగ్ విషయంలో ప్రతి చిన్న విషయాన్ని చాల నిశితంగా పరిశీలిస్తూ దర్శకుడు అడిగినా అడగకపోయినా అనేక సలహాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇప్పుడు అదే పద్ధతి త్రివిక్రమ్ బన్నీతో తీస్తున్న మూవీ విషయంలో కూడ కొనసాగుతున్నట్లు టాక్.

అయితే త్రివిక్రమ్ మాత్రం బన్నీ దూకుడుకు సద్దుకుపోతు రాజీపడుతున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమధ్య ఈమూవీ షూటింగ్ స్పాట్ లో ఈమూవీ కో-డైరెక్టర్ కు అల్లు అర్జున్ కు భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.ఆ కో డైరెక్టర్ రాజమౌళి లాంటి చాలామంది ప్రముఖుల దగ్గర పనిచేసి ప్రస్తుతం త్రివిక్రమ్ దగ్గర పని చేసినట్లు తెలుస్తోంది. అయితే అంత అనుభం ఉన్న ఆ కో డైరెక్టర్ తో బన్నీ ఒక విషయమై తీవ్రంగా విభేదించడమే కాకుండా ఆ కో డైరెక్టర్ పై కొన్ని మాటలు కూడ విసిరినట్లు తెలుస్తోంది.ఈ చిన్న విషయం పెద్దదిగా మారడంతో బన్నీ పై దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆ కో డైరెక్టర్ అనడంతో కోపంతో బన్నీ షూటింగ్ కు బ్రేక్ వేసినట్లు టాక్.

దీనితో పరిస్థుతులు చేయదారిపోకుండా త్రివిక్రమ్ రంగంలోకి దిగి ఆ కో డైరెక్టర్ కోపాన్ని చల్లార్చి అతడికి అల్లు అర్జున్ తో సయోధ్య కుదిర్చి తిరిగి రేపటి నుంచి ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే విధంగా త్రివిక్రమ్ రాయబారాలు నడపడంతో కథ సుఖాంతం అయినట్లు మాటలు వినిపిస్తున్నాయి..