అల్లు అర్జున్ షాకింగ్ రూల్స్.. మండిపడుతున్న నిర్మాతలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ రూపొందిస్తోన్న ‘అల.. వైకుంఠపురములో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘నా పేరు సూర్య’ సినిమా ఎఫెక్ట్ కి చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్రివిక్రమ్ సినిమాతో హిట్టు కొట్టి చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అలానే ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమా లైన్లో పెట్టి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ ట్రాక్ లోకి వచ్చేశాడని అభిమానులు ఆనందపడుతున్నారు.

అయితే బన్నీ ప్రవర్తన నిర్మాతలకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది.ఇదివరకు ఏ బ్యానర్ లో సినిమా చేసినా.. ఆ నిర్మాతలకు స్వేచ్చను ఇచ్చే బన్నీ ఇప్పుడు తను నటించే ప్రతీ సినిమాకి గీతాఆర్ట్స్ కి వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ కారణంగా హారికా హాసిని సంస్థ ఎక్కువ గొడవ చేయకుండా ‘అల.. వైకుంఠపురములో’ సినిమా విషయంలో గీతాఆర్ట్స్ కి వాటా ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకి కూడా ఇలాంటి షరతే పెట్టాడు బన్నీ. సుకుమార్ తో బన్నీ చేయబోయే సినిమాను మైత్రి మూవీస్ టేకప్ చేస్తోంది. ఇందులో గీతాఆర్ట్స్ కి భాగస్వామ్యం ఇవ్వాలని అల్లు అర్జున్ కండీషన్ పెడుతున్నాడట. ఈ మధ్య కాలంలో మైత్రి మూవీస్ బ్యానర్ కష్టాల్లో ఉందనే చెప్పాలి. చేస్తోన్న సినిమాలకు ప్రాఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు.

చాలా గ్యాప్ తరువాత చేస్తోన్న పెద్ద సినిమాలో ఇలా ప్రాఫిట్ షేరింగ్ అంటే నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. బన్నీ పెట్టిన కండీషన్ కి మైత్రి ఒప్పుకుందా..? లేదా అనే విషయం ఇంకా తెలియదు. బన్నీ మాత్రం ఇకపై తన సినిమాలన్నింటికీ గీతాఆర్ట్స్ ని భాగస్వామిగా చేయాలని ఫిక్స్ అయ్యాడు.