ముందే రికార్డ్ కొట్టిన బన్నీ.. షాకింగ్ రేటుకు ` వైకుంఠ‌పుర‌ం..’ హక్కులు

గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న అల్లు అర్జున్.. తన స్పీడ్ బయట పెడుతున్నాడు. టాలీవుడ్ తెరపై మరోసారి తన స్టామినా నిరూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురములో’ సినిమాకు శ్రీకారం చుట్టారు బన్నీ. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పడం చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అల వైకుఠపురములో’ సినిమా.

ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బన్నీ, త్రివిక్రమ్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ మెగా అభిమాన వర్గాల్లో జోష్ నింపాయి.ఈ నేప‌థ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ‘అల వైకుఠపురములో’ రైట్స్ కోసం ట్రేడ్ వర్గాలు తెగ పోటీ పడ్డాయట. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హ‌క్కుల‌కు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌ దక్కిందట. 19.50 కోట్ల‌కు ఈ హ‌క్కులు అమ్ముడైన‌ట్లు తెలుప్తోంది. దీంతో విడుదలకు ముందే బన్నీ ప్రభంజనం మొదలైందని ఖుషీ అవుతున్నారు ఆయన అభిమానులు.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది ‘అల.. వైకుంఠపురములో’ మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.