స్ట్రీం మీడియాకు షాకిచ్చిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురం సరికొత్త స్ట్రాటజీ

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సినిమా థియేటర్లలో ఉండగానే విడుదల చేసేస్తున్నాయి. దీంతో థియేటర్లలోనే సినిమా చూడాలనే ఆలోచన ప్రేక్షకుల్లో సన్నగిల్లుతోంది. విడుదలకు ముందే పలానా సంస్థ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందని తెలిసిపోతుండటంతో ఇంకో నెల ఆగితే ఇంట్లోనే చూసేయవచ్చనే ఆభిప్రాయానికి వచ్చేస్తూ థియేటర్ల వైపు చూడట్లేదు. రిపీటెడ్ ఆడియన్స్ సైతం తగ్గిపోయారు.

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ బాగా ఎఫెక్ట్ అవుతోంది. దీంతో ‘అల వైకుంఠపురములో’ యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ చిత్రాన్ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ద్వారా చూడలేరు అంటూ పోస్టర్ ద్వారా తెలిపింది. అంటే చిత్రం ఫుల్ రన్ పూర్తయ్యేవరకు డిజిటల్ స్ట్రీమింగ్ ఉండదని వారి సూచన. దీని వలన థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల ప్రేక్షకుల సంఖ్య పెరిగే ఛాన్సుంది. మొత్తానికి ‘అల వైకుంఠపురములో’ డిస్ట్రిబ్యూటర్స్ మంచి నిర్ణయమే తీసుకున్నారు.