అల్లు అర్జున్ కొట్టేసాడుగా..? సామజవరగనమ మరో రేర్ రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కానీ ఆడియో పరంగా మాత్రం బ్లాక్ బస్టర్ ను మించి ఏదన్న పదం ఉన్నట్టయితే దానిని ఈ సినిమా ఆడియోకు ఆపాదించవచ్చు.ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన రెండే రెండు పాటలను ఇప్పటికి విడుదల చేసారు.ఈ రెండు పాటలకు వచ్చిన ఆదరణ అయితే ఇప్పటి దాకా ఇంత తక్కువ సమయంలో ట్రెమండ్యస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ముఖ్యంగా మొదటగా విడుదల చేసిన “సామజవరగమన” అయితే కనీ వినీ ఎరుగని రికార్డును నెలకొల్పే దిశగా కొనసాగుతుంది.అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ రికార్డు ఏమో కానీ మొట్టమొదటి 1 మిలియన్ లైక్స్ అందుకోబోతున్న వీడియో సాంగ్ గా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది.తాజాగా ఈ సాంగ్ 80 మిలియన్ మార్క్ వ్యూస్ ను అందుకోవడమే కాకుండా ఏకంగా 945K(9 లక్షల 45 వేలు లైక్స్) కొల్లగొట్టి 1 మిలియన్ లైక్స్ దిశగా కొనసాగుతుంది.ఇప్పటి వరకు అయితే ఏఈ రికార్డు తెలుగు చిత్రాల నుంచి ఏ సినిమా కూడా అందుకోలేదు.అందువల్ల ఈ రికార్డు మాత్రం “అల వైకుంఠపురములో” చిత్రానికే దక్కుతుందని చెప్పాలి.