అల్లు అర్జున్ న్యూ ప్లాన్… అల కోసం ఇంత ప్లాన్ చేస్తున్నారా..!

అల్లు అర్జున్ పూజ హెగ్దే జంటగా నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న రోజు కంటే ముందుగానే విడుదల కానుంది అని తెలుస్తుంది. ఈ చిత్రం విజయం మీద ఎంతో కాన్ఫిడెంట్ గా వున్న అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని జనవరి 10 న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

 

బాక్సఫీస్ కలెక్షన్ల దృష్ట్యా ఓపెనింగ్స్, ప్రీమియర్ షోల ద్వారా ఇతర చిత్రాల కంటే ఈ చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అల్లు అర్జున్ భావించడం తో 10 న విడుదలకి సిద్ధం చేస్తున్నారట.అయితే తాజాగా న్యూ ఇయర్ కి సంబందించిన పోస్టర్ ని అలా వైకుంఠపురంలో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ ఫై చిత్ర విడుదల కి సంబందించి ఎలాంటి తేదీని ప్రకటించలేదు. అయితే బన్నీ స్ట్రాటజీ ఈ విధంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.