రాహుల్ అలాంటివాడా..? అలీ షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ తెలుగులో ప్రస్తుతం రాహుల్ స్ట్రాంగ్ కంటిస్టెంట్ గా ఉన్నాడు. అసలు మొదటిలోనే హౌస్ నుండి బయటకు వెళ్లాల్సిన రాహుల్ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని స్ట్రాంగ్ గా తయారయ్యాడు. ఒకసారి ఎలిమినేషన్ అయిన కానీ మళ్ళీ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ని రోజులు పునర్నవి తోడుగా రాహుల్ నడిపిన వ్యవహారం హౌస్ లో హాట్ హాట్ గా సాగింది. బహుశా దాని కోసమే ఇద్దరినీ చాలా రోజులు హౌస్ లో ఉంచారనే మాటలు వినవచ్చాయి. అలాగే రాహుల్ కూడా గేమ్ కోసమే పునర్నవితో క్లోజ్ గా మూవ్ అవుతూ గేమ్ ఆడుతూ వచ్చాడని విమర్శలు కూడా వచ్చాయి.

చాలా సార్లు పునర్నవి కూడా రాహుల్ ఇస్ గేమర్ అంటూ మాట్లాడింది.గత వారం పునర్నవి హౌస్ నుండి వెళ్లిపోవటంతో రాహుల్ చాలా బాధపడ్డాడు. ఇక హౌస్ లో ఒంటరిగా కూర్చోవటం లాంటివి చేస్తున్నాడు. తాజాగా దీనిపై అలీ మాట్లాడుతూ ‘రాహుల్ ఇప్పుడు మరో గేమ్ స్టార్ట్ చేశాడు. హౌస్ లో తాను ఒక్కడే వేరు అని, తనకి ఎవరు లేరంటూ బిహేవ్ చేస్తున్నాడు. గేమ్ చివరి దశకి చేరుకుంది, ఈ సమయంలో ఇంకా ఎవరు అవసరం లేదు, గేమ్ ఒక్కటే ముఖ్యమని రాహుల్ అనుకున్నాడు, ఆ విషయం పునర్నవికి కూడా తెలుసు, అందుకే గేమర్ అంటూ రాహుల్ గురించి మాట్లాడింది, ఆమె హౌస్ నుండి వెళ్లే సమయంలో కనీసం బ్యాగ్ కూడా రాహుల్ ముట్టుకుంటే ఒప్పుకోలేదంటూ’ శివజ్యోతితో అలీ చెప్పటం జరుగుతుంది. రాహుల్ కేవలం గేమ్ కోసమే పునర్నవితో స్నేహం చేశాడా..? లేక నిజంగా చేశాడా..? అనేది మున్ముందు తెలుస్తుందేమో చూడాలి.