రాహుల్ ఒక్కడే అలా ఉండేవాడు.. అలీ రెజా ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో రెండవ సీజన్ కౌషల్ వార్ వన్ సైడ్ చేసేయ్యగా మూడవ సీజన్లో కూడా చివరి దశల ఒక్కసారిగా రాహుల్ మ్యానియా మొదలయ్యింది.అసలు విన్నింగ్ రేస్ లోకి రాడు అనుకున్న రాహుల్ ఊహించని రీతిలో ఫైనల్స్ కు వెళ్లి టైటిల్ దక్కించుకున్నాడు.అయితే హౌస్ లో రాహుల్ కు అత్యంత సన్నిహితమైన కంటెస్టెంట్స్ లో అలీ రెజా కూడా ఒకడు.గత కొన్ని రోజుల క్రితమే అలీ రాహుల్ విషయంలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తాను ముందు విన్నవుతానని అనుకున్నాను కానీ చివర్లో ఆ సూచనలు కనిపించకపోయేసరికి రాహులే విన్నవ్వాలని కోరుకున్నానని చెప్పాడు.అంతే కాకుండ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాహుల్ ను ఉద్దేశించి మరోసారి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.హౌస్ మొత్తంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే రాహుల్ ఒక్కడు మాత్రమే నవ్వుతూ దాన్ని ఈజీగా తీసుకుంటాడని సీరియస్ విషయం అయినా సరే నవ్వుతూ ఏం పర్లేదు లైట్ అన్నట్టుగా సింపుల్ గా తీసుకుంటాడని అన్నాడు.బిగ్ బాస్ హౌస్ లో అతనే హ్యాపీ పర్సన్ అని తెలిపాడు.