అలీ చేసిన పెద్ద తప్పు… బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత జరిగింది ఇదే..?

బిగ్ బాస్ లో ఏడవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. అందరూ అనుకున్నట్టుగానే ఆలీ రెజా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ మీద ఆలీ ఒక తప్పు చేసినట్టుగా తెలుస్తుంది. ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఏంటని నాగార్జున అడగగా, ఆరు వారాల నుండి నామినేషన్స్ కి రాకపోవడం ముఖ్య కారణమని అన్నాడు. నామినేషన్స్ వచ్చి ఉంటే ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉండేది. నాకంటూ ఓటేసే వాళ్ళుండేవారు అన్నాడు.మొదటి సారి నామినేషన్ కి రావడమే పెద్ద మైనస్ అని అన్నాడు. ఇక్కడే ఆలీ తప్పు చేసాడు. ఆలీ చెప్పిన లాజిక్ కరెక్టే అయినప్పటికీ, అదొక్కటే ఆలీ ఎలిమినేట్ అవడానికి కారణం కాదన్న విషయం అతను మర్చిపోయాడు.

అక్కడ కూడా తన తప్పుని ఒప్పుకోలేకపోతున్నాడు. తనకున్న కోపం, ప్రతీ దానికి సీరియస్ అవడం, అరవడం అనేవి తను చేసిన తప్పులుగా ఆలీ భావించట్లేదు. ఎవరేం చెప్పినా ఆలీ పట్టించుకోలేదు. తనకి నచ్చిందే చేశాడు.కనీసం ఎదుటి వారు చెప్పేది సరిగ్గా వినేవాడు కూడా కాదు. హౌస్ లో ఉన్నప్పుడు తన గురించి మాట్లాడితే ఎలా తప్పించుకునేవాడో స్టేజి మీద కూడా అలాంటి కారణాలే చెప్పాడు. అంటే తనేమీ తప్పు చేయకుండానే ఎలిమినేట్ అయ్యాడనే ఫీలింగ్ లో ఉన్నాడు. నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం దురదృష్టకరం. అయితే తన అగ్రెసివ్ నెస్, ఆటిట్యూడ్ వల్లే ఎలిమినేట్ అయ్యాడని ఆలీకి తెలిసే ఉండవచ్చు.కానీ వాటిని బయటకు ఎందుకు చెప్పడం అనుకున్నాడో ఏమో అందుకే ఏదో ఒక రీజన్ చెప్పాడు.ఆలీ చెప్పిన లాజిక్ కరెక్టే కానీ, అంతకు మించి కారణాలు కూడా ఉన్నాయని అతను గుర్తుంచుకోవాలి. ఈ నిజాన్ని ఆలీ ఎంత తొందరగా గ్రహిస్తే అంత బాగుంటుంది.