అల వైకుంఠపురంకు అయన కారణంగా బ్రేక్…

మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల వైకుంఠపురంలో సినిమా టీజర్‌కు నిన్న డేట్‌ను ప్రకటించాల్సి ఉంది.నిన్న డేట్‌ ప్రకటిస్తే నేడు లేదా రేపు టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కాని నిన్న మెగా ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు నూర్‌ భాయ్‌ మృతి చెందాడు.ఆయన మృతి చెందడంతో మెగా హీరోలు దాదాపుగా అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంతగా బాధను వ్యక్తం చేశారు.


అందుబాటులో ఉన్న మెగా హీరోలు అంతా కూడా నూర్‌ భాయ్‌ బౌతిక దేహంను సందర్శించి శ్రధ్దాంజలి ఘటించారు.ఈ సందర్బంగా నిన్న అల వైకుంఠపురంలో సినిమా టీజర్‌ డేట్‌ను ప్రకటించలేక పోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించింది.నిన్న వాయిదా వేసిన టీజర్‌ నేడు ప్రకటించారు.టీజర్‌ ను ఈనెల 11న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.అందుకు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేయడం జరిగింది.టీజర్‌కు సంబంధించిన చిన్న వీడియోను కూడా నేడు విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

టీజర్‌ కు చిన్న వీడియో ఏంటో అంటూ సినీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తుండగా హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది.సంక్రాంతి కానుకగా ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.