కేకో కేక.. అల.. వైకుంఠపురములో అసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురంలో చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో టబు ఒక కీలక పాత్రని పోషించనున్నది అని తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సినిమా అంటేనే ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. ఈ చిత్రం లో అవి పుష్కలంగా వుండనున్నాయి. అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఈ చిత్రంలో టబు అల్లు అర్జున్ కి సోదరిగా నటిస్తుందని సమాచారం. అయితే అల్లు అర్జున్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.

టబు బాగా డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్తుందట. అక్కడ జరిగే పరిణామాలు టబు కు ఇబ్బందికరంగా మారి సమస్యలు వస్తాయి. అయితే ఆ సమస్యలని ఎదుర్కొనేందుకు అల్లు అర్జున్ టబు ఇంట్లో కి వెళ్తాడట. అల్లు అర్జున్ టబు ఇంట్లోకి వెళ్లే సన్నివేశం దగ్గరనుండి అక్కడ చేసే సందడి వరకు చాల ఆసక్తికరంగా సాగుతాయట. ఈ సినిమాలో టిస్టులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో బన్నీ బిల్లియనీర్ గా మారిపోతాడట. అయితే ఈ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం దగ్గర నుండి క్లైమాక్స్ వరకు చాల ఆసక్తికరంగా ఉండనుంది అని సమాచారం. అందుకేనేమో ఈ చిత్రం ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ చేతిలో బీడీ ఉంటే వెనుక మాత్రం ఒక లగ్జరీ కారు, బిల్డింగ్ ఉంటుంది. అపుడు జనాలు అర్ధం కాక తికమక పడిన ఇపుడు మాత్రం ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు.