వైకుంఠపురం అసలు కథ ఇదే..? నెట్టింట్లో వైరల్

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో అల వైకుంఠపురం లో అనే సినిమా తెరకెక్కుతుంది. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పారిస్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ కథ ఇదే అంటూ సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం అవుతుంది.ఈ సినిమా కథ రెండు కుంటుబాల మధ్య సాగనుంది. ఓ ఉన్నత కుటుంబం, వారి దగ్గర డైవర్‌గా పని చేసే వ్యక్తి కుటుంబం సన్నిహింతంగా ఉంటుంటారు.

వీరిద్దరికి ఒకేసారి మగపిల్లలు పుడతారు. అయితే కొన్ని కారణాల వల్ల డైవర్‌ కొడుకు పెద్దింట్లో, పెద్దింటి అబ్బాయి డ్రైవర్‌ ఇంట్లో పెరుగుతాడు. చివరికి అసలు నిజం బయటపడింది. అసలు ఒకరి ఇంట్లో ఒకరు పెరగటానికి కారణం ఏంటి అన్నదే అసలు కథ.ఈ కథలో పెద్దింట్లో పుట్టి డ్రైవర్‌ ఇంట్లో పెరిగే కుర్రాడిగా అల్లు అర్జున్‌, డ్రైవర్‌ ఇంట్లో పుట్టి పెద్దింట్లో పెరిగే కుర్రాడిగా సుశాంత్ నటించనున్నారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్‌ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.