ఐశ్వర్యరాయ్ ఇంత ఎఫైర్ నడిపిందా..?

సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ఏ విష‌యం అయినా బాగా వైర‌ల్ అవుతూ ఉంటుంది. సెల‌బ్రిటీల‌కు సంబంధించి చిన్న‌ న్యూస్ ‌బ‌య‌ట‌కు వ‌స్తే చాలు దాని గురించి ఎవ‌రికి వారు పుంఖాను పుంఖాలుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇక మాజీ ప్ర‌పంచ సుంద‌రి, ఒక‌ప్పుడు దేశాన్ని త‌న అంద చందాల‌తో ఊపేసిన స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాయ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మాజీ ప్ర‌పంచ సుంద‌రి అయిన ఐశ్వ‌ర్యారాయ్ సినిమాల్లోకి రావ‌డ‌మే స్టార్ స్టేట‌స్‌తో వ‌చ్చింది. అప్ప‌టి నుంచి వ‌రుస హిట్ల‌తో ఆమె దూసుకు పోయింది.అందంతో పాటు అభిన‌యం కూడా ఉండ‌డంతో ఐశ్వ‌ర్య‌కు అవ‌కాశాల కొద‌వ లేదు.

ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో ఐశ్వ‌ర్య ప్రేమ‌ల‌కు సంబంధించి అనేక క‌థ‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ముందుగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌తో ఆమెకు ఉన్న ప్రేమాయ‌ణం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స‌ల్మాన్‌తో ఆమె ప్రేమాయ‌ణం దాదాపు పెళ్లి వ‌ర‌కు వెళుతుంది అనుకుంటున్న టైంలో వీరిద‌ద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగి విడిపోయారు. ఆ త‌ర్వాత ఆమె వ‌య‌స్సులో త‌న‌కంటే చిన్న వాడు అయిన వివేక్ ఒబెరాయ్‌ను ప్రేమించింద‌న్న టాక్ వ‌చ్చింది.వీరిద్ద‌రు కూడా పెళ్లి చేసుకుంటారు అనుకునే టైంలో విడిపోయారు. ఆ త‌ర్వాత త‌న కంటే వ‌య‌స్సులో యేడాది చిన్న‌వాడు అయిన అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ఆమె పెళ్లాడింది. అయితే ఓ బిజినెస్ టైకూన్‌తో కూడా ఆమె ఎఫైర్ న‌డిపిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు పుకార్లు షికార్లు చేశాయి. ఆ టైకూన్ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ దివంగ‌త పారిశ్రామిక వేత్త ధీరూబాయ్ అంబానీ కొడుకు అనిల్ అంబానీ యే అట‌. ఈ వార్త‌ల‌పై ఆమె ఎప్పుడూ స్పందించ లేదు.

అయితే అనిల్తో ఎఫైర్‌పై ఆమెకు ఓ సారి ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న ఎదురైంది. అప్పుడు ఆమె బ‌దులు ఇస్తూ ఎప్పుడూ వార్త‌ల గ్లామ‌ర్ కోసం నా పేరే ఎందుకు వాడ‌తారు ? అని కౌంట‌ర్ ఇచ్చింది.