సీయంలతో మాకు సంబందం లేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఏటా ఘనంగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాని కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి, నాగార్జున తెలిపారు. అయితే 2018, 2019 సంవత్సరానికి గానూ ఏఎన్నార్ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువురు మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించారు.నాగ్ మాట్లాడుతూ.. ‘ఇది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం.. ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయం సాధించడానికి టీఎస్సార్ ఒక కారణం.. ఆయన మా నాన్నకు క్లోజ్ ఫ్రెండ్.. నాక్కూడా క్లోజ్ ఫ్రెండ్.. మా నాన్న చనిపోయాక.. మా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్నారు..

నాకు ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా.. ఆయన ఏ సమయంలోనైనా రెస్పాండ్ అవుతారు. సుబ్బిరామి రెడ్డిగారికి థ్యాంక్స్.. ఈ కార్యక్రమంలో భాగంగానే.. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్నాము. చివరగా అమితాబ్‌, రాజమౌళి కొంతమంది విద్యార్థులకు అందజేశాము. ఈ సారి రేఖ చేతుల మీదుగా ప్రధానం చేస్తాము. రేఖ గారికి ఫోన్ చేసిన వెంటనే వస్తానని చెప్పారు. చిరంజీవి చేతుల మీదుగా 2018 – శ్రీదేవీ, 2019 -రేఖకు అవార్డును ప్రధానం చేయనున్నాము. అవార్డులో భాగంగా ఐదు లక్షలు ఇస్తామని, మొదటి నుంచి అదే పాటిస్తున్నాము.. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు.. అవార్డు ముఖ్యమ’ని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు గానూ.. ఈ కార్యక్రమానికి ఏ సీఎంలను పిలవడం లేదని చెప్పారు.టీఎస్సార్ మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు.. తన పేరు మీద కూడా ఓ అవార్డును ప్రకటించాలని, గొప్ప వారికి వాటిని బహూకరించాలని అన్నారు.. ఆ కమిటీ నన్ను చైర్మన్‌గా ఉండమని కోరారు.. అలా మొదటగా లతా మంగేష్కర్ గారికి ఇచ్చాము.. ఆ తరువాత దేవానంద్, వైజయంతీ మాల, హేమా మాలిని, శ్యామ్ బెనెగళ్, కె బాలచందర్, అమితాబ్, రాజమౌళి.. ఇలా సినీ పరిశ్రమకు ఎనలేని కృషి చేస్తున్నవారికి అందిస్తూ వస్తున్నాము. దాన్ని ఆయన కుమారుడు నాగార్జున ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ సందర్భంలో నాగార్జునను మెచ్చుకోవాలి.. తండ్రి కోరికను, ఆలోచననలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ఈ కాలంలో తల్లిదండ్రులంటే ప్రేమ ఉంటుంది.. తరువాత మరిచిపోతారు.. కానీ వారి కోరికలు గుర్తుండవు కానీ నాగార్జున్ మాత్రం అలా కాదు.. వారి తండ్రి కోరికను ఇలా నెరవేరుస్తూ వస్తున్నారు. ఏఎన్నార్ లాంటి మహనీయ వ్యక్తి మరొకరుండరు.. ఆయన నా కలలోకి వస్తుంటారు. ఈ కార్యక్రమం ఆదివారం (నవంబర్ 17) నాడు అంగరంగ వైభవంగా జరగబోతోంది. శ్రీదేవీ, రేఖలకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నాము. ఏఎన్నార్ నా కలలోకి వస్తూ ఉంటారు. బోనీకపూర్, జాన్వీ, ఖుషీ కపూర్‌లు తీసుకుంటారు’ అని అన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.