షాకింగ్ అఫ్ డేట్.. మరోసారి అర్జున్ రెడ్డి కాంబినేషన్

తెలుగులో సంచలనం సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి, డైరెక్టర్ సందీప్ కి మంచి పేరు వచ్చింది.. ప్రస్తుతం విజయ్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఉంటే సందీప్ బాలీవుడ్ లో రణవీర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో సందీప్ కి ఓ ప్రశ్న ఎదురైంది..సందీప్ , విజయ్ కలయికలో సినిమా వస్తే చూడాలని యావత్ ప్రేక్షకులు , అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్నీ సందీప్ దగ్గర ప్రస్తావిస్తే..ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమా తర్వాత విజయ్ తోనే చేస్తానని వెల్లడించాడు.మరో అర్జున్ రెడ్డి సినిమా చేస్తాడా లేక వేరే కథ తీసుకుంటాడా అనే విషయం మాత్రం తెలియదు.