అడ్డంగా దోరికిపోయిన శ్రీ రెడ్డి

టాలీవుడ్ నాట వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి చెన్నై కి మకాం మార్చిన శ్రీ రెడ్డి గురించి తెలియనివాళ్ళు వుండరు. కాస్టింగ్ కౌచ్ అంటూ మీడియా లో సంచలనం సృష్టించి, పవన్ కళ్యాణ్ ఫై తరచూ విమర్శలు చేస్తూ చాల ఫేమస్ అయిన శ్రీ రెడ్డి పేరు మీదుగా ప్రస్తుతం ఒక చిత్రం తెరకెక్కుతుంది. శ్రీ రెడ్డి దొరికిపోయింది అని టైటిల్ తో ఉప శీర్షిక మానవ మృగాలకు అని వుంది. రాహుల్ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్యన్, ఉపాసన హీరో, హీరొయిన్ లుగా నటిస్తున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. అయితే శ్రీ రెడ్డి దొరికిపోయింది అనే టైటిల్ నెగటివ్ గా ఉండటం, శ్రీ రెడ్డి వివాదాల నటి కావడం తో ఈ చిత్రం టైటిల్ విడుదల చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రం శ్రీ రెడ్డి బయోపిక్ లా ఉంటుందేమో అని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ టైటిల్ ఫై అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. శ్రీ రెడ్డి సైతం ఈ టైటిల్ ఫై స్పందించే అవకాశం వున్నట్లుగా కొందరు పేర్కొంటున్నారు. టైటిల్ తోనే అద్దిరిపోయే రెస్పాన్స్ రాబట్టిన ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి అని కొందరు అంటున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.