అబద్దం చెప్పిన రాజమౌళి.. ఎందుకిలా చేసారంటున్న అభిమానులు

అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో గతవారం జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మహా సభల్లో రాజమౌళి పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఆయన ఆ సమయంలో వాషింగ్టన్ వెళ్లడం కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే వెంటనే రాజమౌళి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘వ్యక్తిగత పని మీద వాషింగ్టన్ వచ్చాను. ‘తానా’ సభల్లో పాల్గొనడం లేదు, పెద్దన్న(కీరవాణి) మ్యూజిక్ కాన్సెర్టుకు కూడా నేను హాజరు కాకపోవచ్చు. నేను వస్తానని ఎదురు చూసే వారికి క్లారిటీ ఇవ్వాలనే ఈ ట్వీట్ చేస్తున్నాను’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాను రావడం లేదని ప్రకటించిన రాజమౌళి…. తానా సభల్లో కనిపించడం అందరినీ విస్మయానికి గురిచేసిందట. తన సోదరుడు ఎంఎం కీరవాణితో కలిసి రాజమౌళి తానా సభల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి. ‘తానా’ నిర్వాహకులు రాజమౌళిని స్టేజీ మీదకు పిలవగా…. రావడానికి ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే తాను రావడం లేదని అభిమానులకు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన జక్కన్న… ఇలా ఎందుకు చేశారు? అబద్దం ఎందుకు చెప్పారు అనేది చర్చనీయాంశం అయింది.అయితే రాజమౌళి రాకపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. జులై 4న కీరవాణి పుట్టినరోజు కావడంతో అన్నయ్యను విష్ చేయడానికే ‘తానా’ సభలు జరుగుతున్న చోటుకు వచ్చాడని కొందరు అంటున్నారు. కేవలం అన్నయ్యను విష్ చేయడానికే అయితే హోటల్ రూములో వెయిట్ చేయొచ్చుకదా… ట్విట్టర్లో తాను రావడం లేదని సంకేతాలు ఇచ్చి, మళ్లీ అక్కడికే వెళ్లడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

రాజమౌళిపై కమ్యూనిటీ సంబంధమైన ఆరోపణలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. తనపై కమ్యూనిటీ ముద్ర పడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారని, అందుకే కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమాలకు వెళ్లడానికి ఆయన పెద్దగా ఇష్టపడరని చెబుతుంటారు. తాజా వ్యవహారంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశం అయింది. అయితే రాజమౌళి నిజంగా ‘తానా’ సభలకు వెళ్లారా? లేదా? అనే విషయంలో అఫీషియల్ సమాచారం అయితే లేదు. కేవలం ఇంటర్నెట్లో సర్క్వ్యూలేట్ అవుతున్న కొన్ని ఫోటోలు ఆయన ‘తానా’ సభలకు వెళ్లారు, అబద్దరం చెప్పారు అనే రూమర్లకు కారణమైంది. మరి దీనిపై ఈ బాహుబలి డైరెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.