పదేళ్ళ క్రితమే లవ్ లో.. సీక్రేట్ బయపెట్టిన నాని

ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. అవి మన నోటి నుంచే ఎప్పుడు ఎలా బయటకొస్తాయో ఊహించలేం. తాజాగా నాని విషయంలో అదే జరిగింది. తన ప్రేమ సంగతిని తానే స్వయంగా, అదీ పబ్లిక్‌గా చెప్పేశారు నాని. వివరాల్లోకి పోతే.. నాని హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్బంగా నిన్న (సెప్టెంబర్ 10 న) వైజాగ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు నాని సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. అయితే స్టేజీపై మాట్లాడిన నాని.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ ధైర్యం ఎప్పుడూ చేయం.. ఒక్కసారైనా మెగాస్టార్‌తో షేర్ చేసుకోవాలని ఉంది..

తాను పదేళ్ల క్రితమే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని, ఆ అమ్మాయిది వైజాగే అని చెప్పాడు నాని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఈ సిటీతో లవ్‌లోనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. వైజాగ్ ఓ అందమైన ప్రదేశమని, ఇంతకంటే అందమైన ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెబుతూ వైజాగ్ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు నాని. వైజాగ్ తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు.తన ‘అష్టా చెమ్మా’ సినిమాకి మూడు రోజుల ముందు స్పెషల్ ప్రీమియర్ షో ఇక్కడే జరిగిందని గుర్తు చేసిన ఆయన.. తన కెరియర్ ఇక్కడే బిగిన్ అయ్యిందని తెలిపారు. ఈ 11 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియదు.. మళ్లీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాకి మూడు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.సో ఈ లెక్కన రాబోయే 11 సంవత్సరాలు కూడా తాను సేఫ్ అని చెప్పారు నాని. మీ అందరి ముందు నా చిత్రయూనిట్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. వైజాగ్‌లో ‘గ్యాంగ్ లీడర్’ ఏయే థియేటర్స్‌తో విడుదలౌతుందో తెలియదు కానీ, 13 నుండి ఒక్కో థియేటర్‌లో టిక్కెట్ ముక్కకూడా దొరక్కూడదని నాని ఆసక్తికరంగా మాట్లాడారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రూపొందింది. చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్‌ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబ‌ర్ 13న ఈ సినిమా విడుద‌ల కానుంది.