వీడియో వైరల్.. నన్ను అప్పుడే చంపకండిరా..? యాంకర్ ప్రదీప్ ఆవేదన

యాంకర్ ప్రదీప్.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడీ యాంకర్ కమ్ యాక్టర్. బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న ప్రదీప్.. వెండితెర పైనా మెరిశాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో ప్రదీప్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. ఈ క్రమంలో ప్రదీప్ ఉన్నట్లుండి మాయమైపోయాడు. దీంతో అతడిపై ఎన్నో రూమర్లు ప్రచారం అయ్యాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చేశాడు ఈ బిజీ యాంకర్. ఇంతకీ ప్రదీప్‌కు ఏమైంది..? ఇన్ని రోజులు అతడు ఎక్కడికి వెళ్లిపోయాడు..? పూర్తి వివరాల్లోకి వెళితే…

తెలుగు బుల్లితెరపై బిజీ బిజీగా గడుపుతున్నాడు యాంకర్ ప్రదీప్. చేతి నిండా షోలు ఉన్నా సినిమాల్లో సైతం మెప్పిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అతడు కనిపించడం లేదు. ప్రస్తుతం చేస్తున్న షోలలో కూడా చేయడం లేదు. దీంతో ప్రదీప్ ఏమైపోయాడు అంటూ అందరిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రదీప్ హాట్ టాపిక్ అయిపోయాడు. ప్రదీప్ దాదాపు నెల రోజుల పాటు కనపడకపోవడంతో అతడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు, మరికొన్ని యూట్యూబ్ చానెళ్లు అయితే ప్రదీప్‌కు యాక్సిడెంట్ అయిందని చెప్పుకొచ్చాయి. ఇంకొన్ని సైట్లు ప్రదీప్ ఆరోగ్యం క్షిణించిందని వార్తలు రాశాయి. దీంతో అతడి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.తనపై వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం ప్రదీప్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా గురువారం రాత్రి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సమయంలో కొద్దిసేపు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. అంతేకాదు, ఇన్ని రోజులు ఎక్కడున్నాడో వివరించాడు.తాను వర్క్ చేస్తున్న షోలలో కనిపించకపోవడానికి ప్రదీప్ కారణం చెప్పాడు. ‘ఓ షో షూటింగ్ జరుగుతున్న సమయంలో నాకు చిన్న ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నా కాలుకు ఫ్యాక్చర్ అయింది. దీంతో డాక్టర్లు ఎక్కువ సేపు నిల్చోకూడదని చెప్పారు. అలాగే, ఐదారు వారాల పాటు రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే విశ్రాంతి తీసుకుంటున్నా’ అని వెల్లడించాడు.తాను సంతకాలు చేసిన షోలలో త్వరలోనే పాల్గొంటానని యాంకర్ ప్రదీప్ వెల్లడించాడు. ‘కాలుకు దెబ్బ తగలడం వల్లే ప్రస్తుతం చేస్తున్న షోలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌కు వెళ్లలేదు. ప్రస్తుతం నేను కోలుకున్నాను. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాను. ఈ నెల మూడో వారంలో జరిగే షెడ్యూళ్లలో పాల్గొంటాను’ అని వివరించాడు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడాడు. ‘ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చూశాను. వాటిలో కొన్ని ‘‘యాంకర్ ప్రదీప్ ఆరోగ్యం క్షిణించింది”, ‘‘ప్రదీప్ ఆరోగ్య పరిస్థితి విషమం” ఇలా బోలెడు కథనాలు రాశాయి. అవన్నీ చూసి నాలో నేనే నవ్వుకున్నాను. ఏమాటకు ఆ మాటే. వాళ్లు మాత్రం బాగా క్రియేటివ్‌గా రాశారు’ అని ప్రదీప్ పేర్కొన్నాడు.
తన కోసం తపన పడిన అభిమానుల గురించి ప్రదీప్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘సోషల్ మీడియాలో నా గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వాటిని చూసి చాలా మంది ఆందోళన చెందారు. అంతేకాదు, చాలా మంది నాకు ఫోన్, మెసేజ్‌ చేశారు. అలాగే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ చేశారు. వాళ్లందరకీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.